తెలంగాణలో నానో యూరియా ప్లాంటు పెట్టండి

ప్రధానాంశాలు

తెలంగాణలో నానో యూరియా ప్లాంటు పెట్టండి

ఇఫ్కో కంపెనీకి వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి వినతి

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణలో నానో యూరియా ప్లాంటు పెట్టాలని ఇఫ్కో కంపెనీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. భూమితోపాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం కేసీఆర్‌ అన్నివిధాలా సహకరిస్తారని చెప్పారు. దక్షిణ తెలంగాణలో ప్లాంటు ఏర్పాటుచేస్తే కర్ణాటక, ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఇఫ్కో ఉత్పత్తుల రవాణా సులభంగా ఉంటుందని ఆయన సూచించారు. ప్లాంటు ఏర్పాటుపై కంపెనీ పాలక మండలి సమావేశంలో చర్చిస్తామని ఇఫ్కో ఉపాధ్యక్షుడు దిలీప్‌ సంగానియా మంత్రికి చెప్పారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌ జిల్లా కలోల్‌లో ఇఫ్కో పరిశ్రమను, సబర్‌కాంత జిల్లా ఓరన్‌లో వేరుసెనగ శుద్ధి ప్లాంటును శనివారం మంత్రి సందర్శించారు. నానో యూరియా తయారుచేసే శాస్త్రవేత్తలను, ఇఫ్కో అధికారులను అభినందించారు. 500 మిల్లీలీటర్ల నానో యూరియా 127 లీటర్ల నీటిలో కలిపి ఎకరా పంటకు చల్లవచ్చని తెలిపారు. కేవలం రూ.240కి 500 మి.లీ. లభిస్తోందన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని