ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఎన్‌సీసీ

ప్రధానాంశాలు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఎన్‌సీసీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో నేషనల్‌ కేడెట్‌ కార్ప్‌(ఎన్‌సీసీ) విభాగాలను నెలకొల్పాలని ఇంటర్‌ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కమిషనర్‌ జలీల్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ విద్యాసంవత్సరం 500 మంది విద్యార్థులకు మించి ఉన్న, తగిన వసతులు కలిగిన కళాశాలల్లో వీటి ప్రారంభానికి ప్రతిపాదనలు పంపాలని ఆయన జిల్లా ఇంటర్‌ విద్యా శాఖ అధికారు(డీఐఈవో)లను ఆదేశించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని