ఏపీ అప్పులపై మీడియాకు లీకుల అనుమానం

ప్రధానాంశాలు

ఏపీ అప్పులపై మీడియాకు లీకుల అనుమానం

పలువురు అధికారులపై వేటు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక విషయాల గుట్టు రట్టు చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఆర్థికశాఖలో పనిచేసేవారు మీడియాకు సమాచారం లీకు చేస్తున్నారనే అనుమానంతో సీఎఫ్‌ఎంఎస్‌లోనూ చర్యలు తీసుకుంది. ముగ్గురు అధికారులను ఖజానా శాఖకు తిప్పి పంపింది. అదే విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అయిదుగురిని హఠాత్తుగా తొలగించింది. ఆర్థికశాఖ అధికారుల సస్పెన్షన్‌కు ప్రభుత్వం కారణాలు చెప్పినా సీఎఫ్‌ఎంఎస్‌లో చర్యలకు ఎలాంటి కారణాలూ వెల్లడించలేదు. ఇతరత్రా ప్రభుత్వశాఖల నుంచి వచ్చి పనిచేసిన వారిని తిరిగి మాతృశాఖకు పంపడం మామూలేనని అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఎప్పుడైనా సాగనంపొచ్చని పేర్కొంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, జీతాల చెల్లింపుల్లో ఆలస్యాలు, ఇతరత్రా చెల్లింపుల అంశాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఈ చర్యలన్నీ బుధవారం చేపట్టిందని చెబుతున్నారు. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమయ్యింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని