9న రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభం!

ప్రధానాంశాలు

9న రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభం!

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోదీ ఈ నెల 9న వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఈ ఏర్పాట్ల పరిశీలనకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్‌ కుబ 8న రామగుండం రానున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నుంచి 2016, ఆగస్టు 7న ఆన్‌లైన్‌లో రామగుండం ఎరువుల కర్మాగారం పనులకు శంకుస్థాపన చేశారు. దీంట్లో 2020, మార్చిలో ఉత్పత్తి ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది. కరోనా, ట్రయల్‌ రన్‌లో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఈ ఏడాది ప్రారంభంలో చేపట్టిన ట్రయల్‌ రన్‌లో మొదట ఉత్పత్తి అయిన ఎరువును తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి సన్నిధికి అందించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని