పురపాలక ఆన్‌లైన్‌లో మార్పులు

ప్రధానాంశాలు

పురపాలక ఆన్‌లైన్‌లో మార్పులు

‘ఈనాడు’ కథనానికి స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లో స్వీయధ్రువీకరణ ద్వారా ఇంటి నంబరు పొందడం, ఆస్తిపన్ను స్వీయ మదింపునకు సంబంధించి ఆన్‌లైన్‌ విధానంలో మార్పులు తీసుకువస్తున్నట్లు పురపాలకశాఖ డైరెక్టర్‌ సత్యనారాయణ వెల్లడించారు. ‘అక్రమాలకు స్వీయ ధ్రువీకరణ’ శీర్షికతో ‘ఈనాడు’లో బుధవారం ప్రచురితమైన కథనానికి స్పందనగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదిలాబాద్‌లో అక్రమ ఇంటి నంబర్లు, ఆస్తిపన్ను తప్పుడు అంచనాలపై విచారణ చేసి, 45 అసెస్‌మెంట్లను రద్దు చేసినట్లు తెలిపారు. మొత్తం 336 ఆస్తిపన్ను మదింపు అంచనాలు నిబంధనల మేరకు లేవని స్పష్టమైందని తెలిపారు. కొత్త పురపాలక చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి స్వీయమదింపు విధానంలో నిర్ణయమైన ఆస్తిపన్నులపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో విచారణ చేశామని తెలిపారు. తప్పుడు ధ్రువీకరణలు గుర్తించిన చోట రద్దు, జరిమానా వంటి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని