నలుగురు తెలుగు మహిళలకు నైటింగేల్‌ అవార్డులు

ప్రధానాంశాలు

నలుగురు తెలుగు మహిళలకు నైటింగేల్‌ అవార్డులు

 వీసీ ద్వారా అందించిన రాష్ట్రపతి

ఈనాడు, దిల్లీ; భీమదేవరపల్లి, న్యూస్‌టుడే:  ఉత్తమ వైద్య సేవలు అందించిన నలుగురు తెలుగు మహిళలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం నేషనల్‌ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డులు ప్రదానం చేశారు. వీరిలో ముగ్గురు నర్సులు, ఓ వైద్యురాలు ఉన్నారు. తెలంగాణ నుంచి హైదరాబాద్‌లోని అఫ్జల్‌సాగర్‌ గ్రామీణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి చెందిన అనపర్తి అరుణకుమారి, ప్రస్తుతం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామ ఏఎన్‌ఎంగా వ్యవహరిస్తున్న ఎండీ సుక్రాలు ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రానికి చెందిన డి.రూపకళ, శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలోని నర్సింగ్‌ కాలేజీకి చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ అమ్ములూరు పద్మజ ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌(వీసీ) ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 51 మంది ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను రాష్ట్రపతి కోవింద్‌ అభినందించారు.

సుక్రా సేవలు భేష్‌

కరోనాకు వెరవక వైద్య సేవలందించిన ఏఎన్‌ఎం మహ్మద్‌ సుక్రా సేవలు భేష్‌ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కితాబు ఇచ్చారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపురంలో అందించిన సేవలకు ఆమె పురస్కారానికి ఎంపికయ్యారు. సుక్రా వైద్య శాఖలో 30 ఏళ్లుగా పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారు. తాను అందించిన సేవల వీడియో వీక్షించి రాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారని సుక్రా తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని