ఏపీపీ పోస్టులకు 3,089 దరఖాస్తులు

ప్రధానాంశాలు

ఏపీపీ పోస్టులకు 3,089 దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) విడుదల చేసిన అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) పోస్టుల కోసం 3,089 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 151 పోస్టులు ఉండగా.. ఒక్కో పోస్టుకు సగటున 20 దరఖాస్తులు వచ్చినట్లు నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీకి గత జులై 4న నోటిఫికేషన్‌ వెలువరించిన టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ.. గత ఆగస్టు 11 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరించింది. అక్టోబరు 24న రాతపరీక్ష నిర్వహిస్తామంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని