రాష్ట్ర ఘనతను వారికి తెలియజేయండి

ప్రధానాంశాలు

రాష్ట్ర ఘనతను వారికి తెలియజేయండి

ప్రజలకు ట్విటర్‌లో కేటీఆర్‌ సూచన

ఈనాడు, హైదరాబాద్‌: జనాభాలో 12వ స్థానంలో, భౌగోళికంగా 11వ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం.. దేశ ఆర్థిక వ్యవస్థకు నాలుగో అతిపెద్ద భాగస్వామిగా నిలవడం తమకు గర్వకారణమని మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం సమర్థతను చాటుకుంటోందని గురువారం ట్విటర్‌లో తెలిపారు. ఆర్‌బీఐ ఇచ్చిన తాజా నివేదిక ప్రతిని ట్విటర్‌లో ట్యాగ్‌ చేసిన కేటీఆర్‌.. తెలంగాణకు అది ఇచ్చాం, ఇది ఇచ్చాం అని అర్థంపర్థం లేని ప్రకటనలు ఇచ్చే అజ్ఞానులకు దీన్ని చూపి రాష్ట్ర ఘనతను తెలియజేయాలని ప్రజలకు సూచించారు. తెలంగాణకు ఎవరూ ఏమీ ఇవ్వలేదని, రాష్ట్రమే దేశానికి అండగా నిలుస్తోందన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని