మావోయిస్టు దంపతుల లొంగుబాటు

ప్రధానాంశాలు

మావోయిస్టు దంపతుల లొంగుబాటు

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో బుధవారం రాత్రి మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. బీజాపూర్‌ జిల్లా బోడంగా గ్రామానికి చెందిన పగూ కొవాసీ, మోతీన్‌ గత కొన్నేళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో పని చేస్తున్నారు. ఉద్యమంపై విరక్తి చెందిన ఆ దంపతులు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారిద్దరు తమకు పుట్టిన ఆరు నెలల బిడ్డ సహా సీఆర్‌పీఎఫ్‌ డీఐజీ కోమల్‌సింహా, ఎస్పీ కమలోచన్‌ కశ్యప్‌, ఏఎస్పీ పంకజ్‌ శుక్లా ఎదుట లొంగిపోయారు. అనంతరం తక్షణ ఆర్థిక సహాయం కింద ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున అందజేశారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం పగూ కొవాసీపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని