కొత్తగా 259 కొవిడ్‌ కేసులు

ప్రధానాంశాలు

కొత్తగా 259 కొవిడ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 259 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,62,785కు పెరిగింది. మహమ్మారికి చిక్కి మరొకరు కన్నుమూయగా.. ఇప్పటి వరకూ 3,900 మంది మృతిచెందారు. తాజాగా 301 మంది కరోనాకు చికిత్స పొంది ఆరోగ్యవంతులు కాగా.. మొత్తంగా 6,53,603 మంది కోలుకున్నారు. ఈ నెల 16న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,282 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని