మహిళలకు చాకలి ఐలమ్మ ఆదర్శం: కేసీఆర్‌

ప్రధానాంశాలు

మహిళలకు చాకలి ఐలమ్మ ఆదర్శం: కేసీఆర్‌

సీఎంకు ఆమె కుటుంబీకుల కృతజ్ఞతలు

ఈనాడు, హైదరాబాద్‌: మహిళలకు చాకలి ఐలమ్మ ఆదర్శమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఆమె కుటుంబసభ్యులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో ఐలమ్మ వారసులు పాలకుర్తి మాజీ సర్పంచి చిట్యాల రామచంద్రం, ఆయన కుమారుడు సంపత్‌, ఇతర కుటుంబీకులు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారితో మాట్లాడారు. వారి వెంట మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర ఛైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజయ్య, ఆరూరి రమేశ్‌, నరేందర్‌రెడ్డి, యాదయ్య తదితరులు ఉన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని