ఏఐజీ సీపీఆర్వో సత్యనారాయణకు చాణక్య పురస్కారం

ప్రధానాంశాలు

ఏఐజీ సీపీఆర్వో సత్యనారాయణకు చాణక్య పురస్కారం

ఈనాడు, హైదరాబాద్‌: ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ) ముఖ్య ప్రజా సంబంధాల అధికారి(చీఫ్‌ పీఆర్‌వో) యు.సత్యనారాయణకు ప్రతిష్ఠాత్మక చాణక్య జాతీయ పురస్కారం వరించింది. వైద్యసేవలకు సంబంధించిన అంశాల్లో ప్రజా సంబంధాలను మెరుగ్గా, విస్తృతంగా అందించిన వారికి జాతీయ స్థాయిలో ఈ పురస్కారాన్ని అందజేస్తుంటారు. గోవాలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ చేతుల మీదుగా సత్యనారాయణ ఈ అవార్డును స్వీకరించారు. ఏఐజీ ఆసుపత్రుల్లో గత 20 ఏళ్లుగా ఈయన ప్రజాసంబంధాల అధికారిగా సేవలందిస్తున్నారు. ముఖ్యంగా కొవిడ్‌ కాలంలో ఏఐజీ అందించిన వైద్యసేవలను, కరోనాపై అవగాహన కార్యక్రమాలను రోగులకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ పురస్కారం తన బాధ్యతలను మరింత పెంచిందనీ, ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి ప్రోత్సాహం, సహకారంతోనే విస్తృత సేవలందించగలుగుతున్నాననీ సత్యనారాయణ పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని