‘పీపుల్స్‌ వార్‌’ పిళ్లా మృతి

ప్రధానాంశాలు

‘పీపుల్స్‌ వార్‌’ పిళ్లా మృతి

మావోయిస్టు పార్టీ సిద్ధాంతకర్తల్లో ఒకరిగా గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: పీపుల్స్‌వార్‌ (ప్రస్తుత మావోయిస్టు పార్టీ) సిద్ధాంతకర్తల్లో ఒకరైన పిళ్లా వెంకటేశ్వరరావు (65) అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాద్‌లో మృతిచెందారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. బెజవాడ వన్‌టౌన్‌లో 1970 దశకం చివర్లో విప్లవోద్యమం వైపు ఆకర్షితులైన యువతరంలో ఆయన ఒకరు. ఆంధ్రా యూనివర్సిటీ శ్రీకాకుళం పీజీ సెంటర్‌లో అర్థశాస్త్రంలో ఎంఏ చేసిన ఆయన కొంతకాలం బెజవాడ అప్పలస్వామి కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. 1984-85 నుంచి పీపుల్స్‌వార్‌లో పూర్తికాలం కార్యకర్తగా మారారు. ఉద్యమంలో రెండు దశాబ్దాలకుపైగా కొనసాగారు. అనారోగ్య కారణాలతో పాటు పార్టీ అగ్రనేతలతో విభేదాల కారణంగా 2004లో లొంగిపోయారు. అనంతరం పత్రికారంగంలో దశాబ్దానికిపైగా పనిచేశారు. కొంతకాలంగా డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. చివరి రోజుల్లో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన దేహాన్ని గాంధీఆసుపత్రికి, కళ్లను ఎల్‌వీప్రసాద్‌ కంటి ఆసుపత్రికి దానం చేసినట్లు సన్నిహితులు తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని