క్యాన్సర్‌ ఆసుపత్రికి ఎస్‌బీఐ రూ.1.5 కోట్ల సాయం

ప్రధానాంశాలు

క్యాన్సర్‌ ఆసుపత్రికి ఎస్‌బీఐ రూ.1.5 కోట్ల సాయం

ఈనాడు, హైదరాబాద్‌: మొబైల్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ యూనిట్‌ ఏర్పాటు కోసం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) శుక్రవారం బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రికి రూ.1.5 కోట్ల రూపాయల విరాళాన్ని అందజేసింది. శుక్రవారం ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా విరాళం చెక్కును ఆసుపత్రి సీఈవో ఆర్‌.వి.ప్రభాకరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌)లో భాగంగా ఎస్‌బీఐ వివిధ సంస్థలకు తోడ్పాటు అందిస్తోందన్నారు. దేశంలో క్యాన్సర్‌ బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ చికిత్సకు మరింత సహకారం అవసరమని అన్నారు. బసవతారకం ఆసుపత్రి సేవలను ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ తెలంగాణ సీజీఎం అమిత్‌ జింగ్రాన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని