1,650 టీఎంసీలు కడలిపాలు

ప్రధానాంశాలు

1,650 టీఎంసీలు కడలిపాలు

ఈ సీజన్‌లో మూడోసారి శ్రీశైలం నుంచి నీటి విడుదల

ఈనాడు, హైదరాబాద్‌; నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: కృష్ణా, గోదావరిపై ఉన్న రిజర్వాయర్లన్నీ పూర్తిస్థాయి నీటిమట్టాలతో తొణికిసలాడుతుండగా, మరోవైపు  వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఇప్పటివరకు ఈ రెండు నదుల నుంచి 1,650 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయి. గోదావరి నుంచి 1,350 టీఎంసీలు కాగా, కృష్ణా నుంచి 300 టీఎంసీలు. కృష్ణాపై ఉన్న ప్రధాన రిజర్వాయర్‌ శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఈ సీజన్‌లోనే మూడోసారి ఎత్తారు. ఇప్పటివరకు శ్రీశైలంలోకి 760 టీఎంసీలు వచ్చింది. కృష్ణానదితో పాటు తుంగభద్ర నుంచి కూడా నీటి ప్రవాహం ఉండటంతో ఈ ప్రాజెక్టులోకి ఎక్కువ నీరు వస్తోంది. ఎగువన ఉన్న ఆలమట్టి నుంచి దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీ వరకు ప్రవాహం ఉంది. అన్ని చోట్లా పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేయడంతో పాటు కాలువలకు నీటి విడుదల కొనసాగుతోంది.  గోదావరిలో కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది.  నాగార్జునసాగర్‌ జలాశయం గేట్ల ద్వారా నీటి విడుదల ప్రారంభమైంది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయానికి శ్రీశైలం నుంచి 10 గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి 1,67,558 క్యూసెక్కుల నీటిని సాగర్‌ జలాశయానికి విడుదల చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని