ప్రాథమిక వైద్యంలో తెలంగాణ ఉత్తమం

ప్రధానాంశాలు

ప్రాథమిక వైద్యంలో తెలంగాణ ఉత్తమం

జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మొదటి స్థానం

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాథమిక వైద్యంలో ఉత్తమ సేవల కేటగిరీలో తెలంగాణకు మొదటి స్థానం దక్కింది. అలాగే పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల విభాగంలో రెండో స్థానం లభించింది. 2018-19 నుంచి 2020-21 సంవత్సరాలకుగాను జాతీయ స్థాయిలో పురస్కారాలకు ఎంపికైన వాటి వివరాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ శుక్రవారం దిల్లీలో ప్రకటించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ సమాచారాన్ని అందించారు. రోగికి సంతృప్తికరమైన వైద్యసేవలు అందించడం తదితర విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పీహెచ్‌సీలకు ‘నాణ్యత ప్రమాణాల ధ్రువపత్రాలను’ కేంద్రం ఏటా అందిస్తోంది. దీన్నే ‘నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ ప్రోగ్రామ్‌’ అంటారు. 2017 నుంచి రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశంలో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 106 ఆసుపత్రులకు ఈ ధ్రువపత్రాలు లభించగా.. మరో 20 దవాఖానలకు త్వరలో లభించడానికి మార్గం సుగమమైందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ వాకాటి కరుణ తెలిపారు. ఈ ధ్రువపత్రం పొందిన ఆసుపత్రికి కేంద్రం నుంచి ప్రోత్సాహకంగా మూడేళ్ల పాటు ఏటా రూ.3 లక్షల చొప్పున నగదు పారితోషికం లభిస్తుందని పేర్కొన్నారు. నాణ్యత ప్రమాణాలను పాటించడం వల్ల వైద్యసిబ్బందిలో నైపుణ్యం మెరుగుపడిందని, తద్వారా రోగులకు మెరుగైన వైద్యసేవలు లభిస్తున్నాయని వివరించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని