మొక్కలు నాటడమే అతిగొప్ప పని: సీఎం కేసీఆర్‌

ప్రధానాంశాలు

మొక్కలు నాటడమే అతిగొప్ప పని: సీఎం కేసీఆర్‌

మట్టి చిగురు పుస్తకావిష్కరణ

ఈనాడు, హైదరాబాద్‌ : మనిషి మనుగడకు మొక్కలు మఖ్యమైనవని, వాటిని నాటడమే మానవ జీవితంలో అతిగొప్ప పని అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మొక్కలు పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి అన్న ఆచరణ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ముందకుసాగుతోందని తెలిపారు. హరితహారం, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాల సమాచారంతో రూపొందించిన ‘మట్టి చిగురు’ పుస్తకాన్ని సీఎం శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత పౌరసమాజంపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, ఎమ్మెల్సీ పలా ్లరాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శంకర్‌ నాయక్‌, చందర్‌, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ వ్యవస్థాపకుడు రాఘవ, రచయిత గౌరీశంకర్‌ పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని