ట్యాక్స్‌బార్‌ అసోసియేషన్‌ కో ఆప్టెడ్‌ సభ్యుడిగా పి.వి.నారాయణరావు

ప్రధానాంశాలు

ట్యాక్స్‌బార్‌ అసోసియేషన్‌ కో ఆప్టెడ్‌ సభ్యుడిగా పి.వి.నారాయణరావు

శివనగర్‌, న్యూస్‌టుడే: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ టాక్స్‌బార్‌ అసోసియేషన్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ కోఆప్టెడ్‌ సభ్యుడిగా 2021-23 సంవత్సరానికి వరంగల్‌కు చెందిన చార్టర్డ్‌ అకౌంటెంటు పి.వి.నారాయణరావు నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ అధ్యక్షుడు సీఏ రితేష్‌ మిత్తల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ చార్టర్డ్‌ అకౌంటెంట్లు, పేరు పొందిన అడ్వొకేట్లు, ట్యాక్స్‌ ప్రాక్టిషనర్స్‌ ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నారు. ట్యాక్స్‌ చెల్లింపుదారుల సమస్యలను ఇరు రాష్ట్రాల ఇన్‌కంటాక్స్‌ ప్రిన్సిపల్‌ కమిషనర్స్‌, సీబీడీటీ దృష్టికి తెచ్చి పరిష్కారం కోసం కృషిచేస్తోందని.. వారు కోరినప్పుడు తగిన నివేదికల సమర్పణ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్యాక్స్‌ పేయర్స్‌కు అవగాహన కల్పిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు రితేష్‌   ఈ సందర్భంగా తెలిపారు. సీఏ పి.వి.నారాయణరావు గతంలో వరంగల్‌ ట్యాక్స్‌ బార్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా, వరంగల్‌ ఐసీఏఐ బ్రాంచి అధ్యక్షుడిగా, జాతీయస్థాయిలో ఐసీఏఐ పబ్లిక్‌ రిలేషన్‌ సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా కొనసాగారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని