ఆర్టీసీ ఛైర్మన్‌గా నేడు బాజిరెడ్డి గోవర్ధన్‌ బాధ్యతల స్వీకరణ

ప్రధానాంశాలు

ఆర్టీసీ ఛైర్మన్‌గా నేడు బాజిరెడ్డి గోవర్ధన్‌ బాధ్యతల స్వీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్‌ సోమవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద గల బస్‌భవన్‌లో ఉదయం 9.15కి జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఆర్టీసీకి ఆయన రెండో ఛైర్మన్‌.

కొణతం దిలీప్‌నకు కేటీఆర్‌ అభినందనలు

గోవాలో ఇటీవల జరిగిన ప్రపంచ సమాచార సదస్సులో ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్‌ సావంత్‌ చేతులమీదుగా చాణక్య పురస్కారం అందుకున్న తెలంగాణ డిజిటల్‌ విభాగం సంచాలకుడు కొణతం దిలీప్‌ను పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అభినందించారు. ఆదివారం కేటీఆర్‌ను దిలీప్‌ కలిసి తన పురస్కారాన్ని చూపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దిలీప్‌ సమర్థ సేవలు అందించి వరుసగా రెండోసారి పురస్కారం పొందారని ప్రశంసించారు. దిలీప్‌ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

రాజారిత్విక్‌ తెలంగాణకు గర్వకారణం

చదరంగంలో గ్రాండ్‌ మాస్టర్‌ హోదా పొందిన తెలంగాణ క్రీడాకారుడు రాజారిత్విక్‌ను పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ఆయన తెలంగాణకు గర్వకారణంగా నిలిచారని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని