‘హద్దు’మీరి తవ్వకాలు

ప్రధానాంశాలు

‘హద్దు’మీరి తవ్వకాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొన్ని నెలల క్రితం తుంగభద్ర తీరంలో ఇసుక రేవు(రీచ్‌)లకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నదిలో నీరు నిండుగా ప్రవహిస్తోంది. దీంతో గుత్తేదారులు 50కి పైగా పడవల్లో ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేసి నదీ గర్భాన్ని తోడి ప్రతిరోజు టన్నుల కొద్దీ ఇసుకను వెలికి తీస్తున్నారు. ఈ క్రమంలో నదీతీరం వెంట తెలంగాణ పరిధిలో ఉన్న జోగులాంబ గద్వాల జిల్లా పెద్దధన్వాడ, చిన్నధన్వాడ, తుమ్మిళ్ల, రాజోలి తదితర గ్రామాల పరిధిలోకి వస్తున్నారు. దీంతో సమీప భవిష్యత్తులో భూగర్భజలాలు అడుగంటి వ్యవసాయానికి అవరోధాలు ఏర్పడే అవకాశం ఉందని ఇక్కడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రాజోలి ఎస్సై లెనిన్‌తో మాట్లాడగా ఏపీ పోలీసులతో మాట్లాడతానన్నారు. అయినా పరిస్థితిలో మార్పు రాకుంటే కేసులు నమోదు చేస్తామన్నారు.

- ఈనాడు, మహబూబ్‌నగర్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని