మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల కేటాయింపు ఉత్తర్వుల జారీ

ప్రధానాంశాలు

మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల కేటాయింపు ఉత్తర్వుల జారీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం కొత్త పాలసీలో భాగంగా దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దుకాణాల్లో 15 శాతం గౌడలకు, 10 శాతం ఎస్సీలకు, 5 శాతం ఎస్టీలకు కేటాయించాలని మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి అనుగుణంగా మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2216 మద్యం దుకాణాలుండగా వాటి కాలపరిమితి అక్టోబరు నెలాఖరుతో ముగియనుండటంతో ఒక నెల గడువును పెంచారు. ఈక్రమంలో నవంబరు ఒకటిన కొత్త పాలసీ ప్రారంభం కానుంది. అప్పటినుంచి రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా 332 దుకాణాలను గౌడలకు, 222 దుకాణాలను ఎస్సీలకు, 111 దుకాణాలను ఎస్టీలకు కేటాయించాల్సి వస్తుంది. అయితే కొత్త పాలసీలో మరిన్ని దుకాణాలను పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రిజర్వుడు దుకాణాల సంఖ్య పెరగనుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని