స్ఫూర్తిప్రదాత కొండా లక్ష్మణ్‌ బాపూజీ: కేటీఆర్‌

ప్రధానాంశాలు

స్ఫూర్తిప్రదాత కొండా లక్ష్మణ్‌ బాపూజీ: కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడైన కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితాంతం ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని మంత్రి హైదరాబాద్‌లోని పురపాలకశాఖ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. లక్ష్మణ్‌ బాపూజీ సేవలను స్మరించుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఆయనను గొప్పగా గౌరవించుకుంటోందన్నారు. మరో మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌, టెస్కాబ్‌ ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, తెరాస నేత గుత్తా జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీసీ కమిషన్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులు కిశోర్‌గౌడ్‌, ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్‌ పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని