పెసర.. మురిపించెరా!

ప్రధానాంశాలు

పెసర.. మురిపించెరా!

సూర్యాపేట మార్కెట్‌లో క్వింటాకు రూ.7409 చెల్లింపు

సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్‌లో ఈ సీజన్‌లో మంగళవారం పెసరకు అధిక ధర పలికింది. నడిగూడెం మండలం రామచంద్రాపురం రైతు ఎస్‌కె మైబేల్లి తీసుకొచ్చిన పెసరకు క్వింటాకు అత్యధికంగా రూ.7409 ధర చెల్లించారు. ఈనామ్‌ అమలవుతున్న తిరుమలగిరి మార్కెట్‌లో ఇదే రోజు క్వింటా పెసరకు రూ.5,800, ఖమ్మం మార్కెట్‌లో రూ.5,875, కె సముద్రంలో రూ.6309, వరంగల్‌లో రూ.6222 ధర పలికింది. సూర్యాపేట మార్కెట్‌లో అపరాలకు మంచి ధర వచ్చేలా ప్రయత్నిస్తున్నామని మార్కెట్‌ కార్యదర్శి ఫసియొద్దీన్‌ తెలిపారు.

- న్యూస్‌టుడే, సూర్యాపేట గ్రామీణం


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని