‘క్లస్టర్‌’ చదువుకు తల్లిదండ్రులూ అంగీకరించాలి

ప్రధానాంశాలు

‘క్లస్టర్‌’ చదువుకు తల్లిదండ్రులూ అంగీకరించాలి

ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీ విద్యార్థులు క్లస్టర్‌ విధానంలో భాగంగా తాను చదువుతున్న డిగ్రీ కళాశాల నుంచి మరో కళాశాలకు వెళ్లి విద్యనభ్యసించాలంటే.. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల అంగీకారం కూడా తప్పనిసరి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి దీనిపై వారం రోజుల్లో విధివిధానాలను ఖరారు చేయనుంది. క్లస్టర్‌ విధానాన్ని ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థులకు అమలు చేస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి మంగళవారం వెల్లడించారు. డిగ్రీ చివరి ఏడాదిలోనూ బీఏ, బీకాం, బీఎస్‌సీ, బీబీఎంలో ద్వితీయ భాషగా తెలుగును ఈ విద్యాసంవత్సరం అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి 10 మంది సబ్జెక్టు నిపుణులు ‘సాహితీ దుందుభి’ పేరిట రూపొందించిన పాఠ్య పుస్తకాన్ని లింబాద్రి, మండలి ఉపాధ్యక్షుడు వెంకటరమణ ఆవిష్కరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని