పరిధి ఆధారంగానే కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై చర్యలు

ప్రధానాంశాలు

పరిధి ఆధారంగానే కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై చర్యలు

రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ

ఈనాడు, హైదరాబాద్‌: రాయలసీమ ఎత్తిపోతల పనుల్లో ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లయితే ట్రైబ్యునల్‌కు ఉన్న పరిధి ఆధారంగానే చర్యలు ఉంటాయని చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) స్పష్టం చేసింది. సాధారణంగా ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు అమలుకానప్పుడు జరిమానా చెల్లించాలని ఆదేశించగలమని, చర్యలకు సంబంధించి మొదటిసారి చర్చ జరుగుతోందని పేర్కొంది. పథకానికి సంబంధించి గతేడాది అక్టోబరు 29న ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించిన ఏపీ ప్రభుత్వ అధికారులతోపాటు ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ జి.శ్రీనివాస్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్లపై మంగళవారం ట్రైబ్యునల్‌ జ్యుడీషియల్‌ సభ్యులు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, సాంకేతిక సభ్యులు కె.సత్యగోపాల్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనతో విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని