కాన్పు చేశారు.. కడుపులో దూది మరిచారు!

ప్రధానాంశాలు

కాన్పు చేశారు.. కడుపులో దూది మరిచారు!

ఇన్‌ఫెక్షన్‌తో మృతిచెందిన మహిళ

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: వైద్యుల నిర్లక్ష్యం ఒక మహిళ ప్రాణాలను తీసింది. ఆమెకు కాన్పు చేసిన సమయంలో వైద్యులు కడుపులో దూది మరచిపోవడంతో తీవ్ర ఇన్‌ఫెక్షన్‌కు గురై ఆమె మృతిచెందారంటూ బంధువులు మంగళవారం భువనగిరిలోని ఒక నర్సింగ్‌హోం ఎదుట ఆందోళనకు దిగారు. వారి కథనం ప్రకారం.. రాయగిరికి చెందిన చింతపల్లి మమత(21)కు ఏడాదిన్నర క్రితం భువనగిరిలోని ఓ నర్సింగ్‌ హోంలో శస్త్రచికిత్స ద్వారా తొలికాన్పు చేశారు. కొన్నాళ్లకు కడుపునొప్పి రావడంతో నర్సింగ్‌హోంకు రాగా మందులు ఇచ్చి పంపించారు. రెండోసారి గర్భం దాల్చిన మమతకు తరచూ కడుపునొప్పి వస్తుండటంతో అక్కడి వైద్యులనే సంప్రదించగా.. హైదరాబాద్‌ వెళ్లమన్నారు. ఈ క్రమంలో ఆమెకు గర్భస్రావం జరిగింది. 3రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి.. మొదటి కాన్పు సమయంలో ఆమె కడుపులో దూది వదిలేయడంతో ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడిందని తెలిపారు. అక్కడే చికిత్స పొందుతూ మమత మంగళవారం మృతిచెందారు. దీనిపై నర్సింగ్‌హోం వైద్యులను వివరణ కోరగా ‘ఆమె మొదటి కాన్పు సందర్భంగా తలెత్తిన ఇబ్బందులతో చనిపోయిందనడానికి ఆధారాలు లేవని, అలాగైతే ఇన్నాళ్లూ ఆరోగ్యంగా ఎలా ఉంటారని ప్రశ్నించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని