హైదరాబాద్‌లో అలర్జీ క్లినిక్‌!

ప్రధానాంశాలు

హైదరాబాద్‌లో అలర్జీ క్లినిక్‌!

అమీర్‌పేట, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని ఛాతీ దవాఖానాలో అలర్జీ క్లినిక్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 20 ఏళ్ల కిందట ఛాతీ (అప్పట్లో టీబీ) ఆసుపత్రిలో ఈ విభాగం నిర్వహించేవారు. అనంతర కాలంలో మూతపడింది. ప్రస్తుతం అలర్జీ బాధితుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర వైద్యవిద్య విభాగం ద్వారా క్లినిక్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేశామని ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.మహబూబ్‌ఖాన్‌ తెలిపారు. అలర్జీ క్లినిక్‌ ద్వారా సమస్యపై పరిశోధన చేయడంతో పాటు నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు, ఔషధాల వినియోగం వంటి పూర్తి సేవలు అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. నూతన భవనంలో ప్రత్యేక ఓపీ విభాగం సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ప్రతి బుధవారం వైద్యసేవలు అందుబాటులో ఉంటాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని