ధరణిలో మరో సదుపాయం

ప్రధానాంశాలు

ధరణిలో మరో సదుపాయం

తప్పుల సవరణకు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ధరణిలో మరో అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. పట్టాదారు స్థానంలో ఇళ్ల స్థలాలు లేదా వ్యవసాయేతర భూమిగా నమోదైన వాటిని సవరించుకునేందుకు అవకాశం ఇచ్చింది. వాటికి సంబంధించి తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని రెవెన్యూశాఖ సూచించింది. ఇప్పటివరకు ఏదైనా సర్వే నంబరులో కొంతభాగం ఇళ్ల స్థలాలుగా మారినా, వ్యవసాయేతర భూమిగా వర్గీకరించినా.. ఆ సర్వే నంబరు మొత్తాన్ని ధరణిలో ఇళ్ల స్థలాలుగానో, వ్యవసాయేతర భూమిగానో చూపిస్తున్నారు. దీంతో పట్టాదారులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పుడు అలాంటివాటిని సవరించుకునేందుకు అవకాశం కల్పించింది.

ఎలా చేసుకోవాలి?

* ఫలానా సర్వే నంబరులో మిగతా భూమి నాలా, ఇళ్లు, ఇళ్ల స్థలాల పరిధిలోకి రాదంటూ వాటికి సరైన ఆధారాలతో ధరణి వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.

* పట్టాదారు వివరాలు, భూమి స్థితి, యాజమాన్య హక్కు పత్రాలు, భూమి వీడియో, ఫొటోలను జత చేయాలి.

* వివరాలు నమోదు చేసిన తరువాత దరఖాస్తుదారుకు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. మీసేవ కేంద్రానికి వెళ్లి అది చూపించి బయోమెట్రిక్‌ ధ్రువీకరణ ఇవ్వాలి.

* ఈ దరఖాస్తు కలెక్టర్‌కు వెళ్తుంది. అక్కడ పరిశీలించి వివరాలతో సంతృప్తి చెందితే ఆమోదిస్తారు. వెంటనే పట్టాదారు పాసు పుస్తకాన్ని పోస్టు ద్వారా పంపిస్తారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని