9999@ రూ.17 లక్షలు

ప్రధానాంశాలు

9999@ రూ.17 లక్షలు

ఫ్యాన్సీ నంబరు దక్కించుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఫ్యాన్సీ నంబర్లు రవాణాశాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా ఖైరతాబాద్‌ రవాణా కార్యాలయం పరిధిలో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన వేలంలో ప్రముఖ సినీ హీరో నందమూరి తారక రామారావు తన కారు కోసం టీఎస్‌09 ఎఫ్‌ఎస్‌ 9999 నంబరును రూ.17 లక్షలకు దక్కించుకున్నారు. కరోనా తర్వాత ఇటీవలి కాలంలో ఇదే రికార్డు ధర అని అధికారులు తెలిపారు. మరో ఫ్యాన్సీ నంబరు టీఎస్‌09 ఎఫ్‌టీ 0001ను లహరి ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.7.01 లక్షలకు, టీఎస్‌09 ఎఫ్‌టీ 0009ను రతన్‌ నల్లా అనే వ్యక్తి రూ.3,75,999కు సొంతం చేసుకున్నారు. మొత్తంగా ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఆర్టీఏకు రూ.45,52,921 ఆదాయం వచ్చిందని జేటీసీ పాండురంగ నాయక్‌ బుధవారం విలేకరులకు తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని