మూడు రోజులుగా కంచెలో చిక్కుకున్న వృద్ధుడు

ప్రధానాంశాలు

మూడు రోజులుగా కంచెలో చిక్కుకున్న వృద్ధుడు

కాపాడి మానవత్వం చాటిన ఎస్సై

తొర్రూరు టౌన్‌, న్యూస్‌టుడే: మూడు రోజులుగా ఇనుప కంచెలో చిక్కుకున్న వృద్ధుడిని కాపాడి మానవత్వం చాటుకున్నారు ఓ ఎస్సై. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం పిల్లిగుండ్లతండాకు చెందిన బాదావత్‌ శ్రీరామ్‌ (65) భార్య కొంతకాలం కిందట మృతి చెందింది. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. కుమారుడు ఉపాధి కోసం వేరే గ్రామంలో ఉంటున్నాడు. శ్రీరామ్‌ ఒంటరిగా జీవిస్తున్నారు. మూడు రోజుల కిందట కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ఆయన... ఇంటి సమీపంలో ఉన్న ఇనుప కంచెలో చిక్కుకున్నారు. బుధవారం అంగన్‌వాడీ టీచర్‌ సుజాత గమనించి పోలీసులకు తెలిపారు. తొర్రూరు ఎస్సై సతీష్‌, కానిస్టేబుల్‌ సాయికృష్ణ అక్కడికి వచ్చారు. వృద్ధుడిని కంచె నుంచి బయటకు తీసుకొచ్చి, జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమానికి తరలించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని