డిండి ఎత్తిపోతలను ఆపండి

ప్రధానాంశాలు

డిండి ఎత్తిపోతలను ఆపండి

ఎన్జీటీలో ఆంధ్రప్రదేశ్‌ పిటిషన్‌

ఈనాడు హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని, దీన్ని నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో పిటిషన్‌ దాఖలు చేసింది. ‘‘ఇది అనధికారిక ప్రాజెక్టు. పది వేల హెక్టార్లకు మించి ఆయకట్టు ఉన్న ఏ ప్రాజెక్టుకైనా పర్యావరణ అనుమతి అవసరం. 30 టీఎంసీలతో 3,68,880 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి లేదు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 11వ షెడ్యూలులోని ప్రాజెక్టుల్లో ఇది లేదు. 25.81 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. దీనివల్ల 16344 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. నాగార్జునసాగర్‌, కృష్ణా డెల్టా సహా అన్ని ప్రాజెక్టులపై ప్రభావం పడుతుంది’’ అని ఏపీ తన పిటిషన్లో వివరించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని