మరో 50 లక్షల డోసులు ఇవ్వండి

ప్రధానాంశాలు

మరో 50 లక్షల డోసులు ఇవ్వండి

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి చేపట్టిన ప్రత్యేక టీకా పంపిణీ (స్పెషల్‌ డ్రైవ్‌) కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించేందుకు అదనంగా 50 లక్షల డోసులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ నెలలో కేంద్రం 30 లక్షల డోసులు సరఫరా చేసినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా ఈ నెల 16 నుంచి 21 వరకు దాదాపు 27 లక్షల మందికి టీకాలు అందజేసినట్లు వెల్లడించాయి. అత్యధికంగా ఈ నెల 18న 6.36 లక్షల టీకాలు వేశారు. రోజుకు 7 లక్షల టీకాలు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని, త్వరితగతిన పంపిణీ పూర్తిచేయడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని