అద్దాల మండపానికి ఐరావతాలు

ప్రధానాంశాలు

అద్దాల మండపానికి ఐరావతాలు

యాదాద్రికి చేరిన విగ్రహాలు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి క్షేత్రంలో నిర్మితమవుతున్న అద్దాల మండపానికి ఐరావతం శిల్ప రూపాలు అదనపు ఆకర్షణను తీసుకురానున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో గోధుమ వర్ణం శిలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహాలను బుధవారం యాదాద్రికి తెచ్చారు. మరోవైపు అష్టభుజ మండప ప్రాకారంలో సిద్ధమవుతున్న అద్దాల మండప ద్వారానికి ఇత్తడి కవచాలతో 12 మంది ఆళ్వారుల ప్రతిమలను బిగించారు. ద్వారానికి ఇరువైపులా సుమారు మూడడుగుల ఎత్తు కలిగిన ఐరావతం విగ్రహాల ఏర్పాటుకు సన్నద్ధమైనట్లు యాడా అధికారులు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని