మల్లన్నసాగర్‌పై మరో నిపుణుల కమిటీ అధ్యయనం

ప్రధానాంశాలు

మల్లన్నసాగర్‌పై మరో నిపుణుల కమిటీ అధ్యయనం

ఈనాడు హైదరాబాద్‌: మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ కట్టపై మరో నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఐఐటీ, ఉస్మానియా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రొఫెసర్లతో కూడిన కమిటీ ఇటీవల పరిశీలించి సీపేజీ  ఉండాల్సిన పరిమితుల్లోనే ఉందని పేర్కొంది. 50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ రిజర్వాయర్‌ను నిర్మించారు. దీని మట్టికట్ట ఎత్తు 60 మీటర్లు. అయిదు టీఎంసీల నీటిని నిల్వ చేసిన తర్వాత నిపుణుల కమిటీ పరిశీలించి మరో అయిదు టీఎంసీలు నిల్వ చేసి పరిశీలించాలని సూచించింది. ప్రస్తుతం సుమారు ఏడు టీఎంసీల నిల్వ ఉంది. నీటిపారుదల శాఖ తాజా నిర్ణయం మేరకు డిజైన్స్‌ నిపుణులు రౌతు సత్యనారాయణ, సుబ్బారావు,  రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ రామరాజు, జీఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ రాజులతో కూడిన కమిటీ మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ డిజైన్లతో పాటు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించనుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని