ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి కోర్టు ధిక్కరణ నోటీసులు

ప్రధానాంశాలు

ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి కోర్టు ధిక్కరణ నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: రైతులకు భూసేకరణ పరిహారం చెల్లింపునకు సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో అక్టోబరు 29న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జగిత్యాల జిల్లా రత్నాపూర్‌కు చెందిన బి.లింగన్న మరో అయిదుగురు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గత విచారణ సందర్భంగా.. పిటిషనర్లకు రూ.52 లక్షలు, వడ్డీ రూ.5.48 లక్షలు చెల్లించడానికి గడువు కావాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కోరారు. కోర్టు కేసుల్లో అపరిష్కృతంగా ఉన్న భూపరిహారం చెల్లింపు కోసం నిధులను మంజూరు చేసినట్లు సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ప్రభుత్వం చెప్పినప్పటికీ సొమ్ము చెల్లించకపోవడాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని