ఇంట్లో ఉండే దేవాలయాల్లో పూజలు

ప్రధానాంశాలు

ఇంట్లో ఉండే దేవాలయాల్లో పూజలు

దసరా సందర్భంగా తపాలా శాఖ ఏర్పాట్లు

ములుగురోడ్డు(వరంగల్‌), న్యూస్‌టుడే: దసరా నవరాత్రుల సందర్భంగా ఇంట్లోనే ఉండి రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక సేవ, కుంకుమార్చన, అష్టోత్తర నామార్చన కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశాన్ని తపాలాశాఖ కల్పించింది. అక్టోబరు 7 నుంచి 15 వరకు బాసర శ్రీ జ్ఞానసరస్వతి, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి, హైదరాబాద్‌ (బల్కంపేట) ఎల్లమ్మ, వేములవాడ రాజరాజేశ్వర, అలంపూర్‌ జోగులాంబ, వరంగల్‌ భద్రకాళి, హైదరాబాద్‌ పెద్దమ్మతలి ్ల(జూబ్లీహిల్స్‌), కట్ట మైసమ్మ(బేగంపేట), ఏడుపాయల వనదుర్గాభవాని దేవాలయాల్లో ప్రజలు తమ గోత్ర నామాలపై ప్రత్యేక పూజలు జరిపించుకోవచ్చు. సదరు సేవలు పొందాలనుకునేవారు సమీప తపాలా కార్యాలయంలో కానీ, పోస్ట్‌మ్యాన్‌కు కానీ రుసుము చెల్లించి పేరు, గోత్ర నామాలు, చిరునామా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధానంలో ప్రత్యేక పూజలు చేయించుకున్న భక్తులకు ప్రసాదాన్ని తపాలాశాఖ స్పీడ్‌ పోస్టు ద్వారా ఇళ్లకు చేర్చుతుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని