రెండు పడక గదుల ఇళ్ల కాలనీలకు రూ.51 కోట్లతో రోడ్లు

ప్రధానాంశాలు

రెండు పడక గదుల ఇళ్ల కాలనీలకు రూ.51 కోట్లతో రోడ్లు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలో రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తున్న ప్రాంతాలకు రూ.51 కోట్లతో రోడ్లను మంజూరు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 17 ప్రాంతాల్లోని ఇళ్ల కాలనీలకు అనుసంధాన రోడ్లను మంజూరు చేస్తున్నట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఆ ఉత్తర్వుల్లో తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని