పెట్టుబడుల కోసం కేటీఆర్‌ కృషి అభినందనీయం

ప్రధానాంశాలు

పెట్టుబడుల కోసం కేటీఆర్‌ కృషి అభినందనీయం

ఆర్‌పీజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ హర్ష్‌గోయెంకా ప్రశంస

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు ఎర్రతివాచీ పరుస్తోందని ప్రసిద్ధ సంస్థ ఆర్‌పీజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ హర్ష్‌ గోయెంకా ప్రశంసించారు. పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ఒక పారిశ్రామికవేత్తకు ప్రత్యేక విమానం పంపించి, రాష్ట్రానికి రూ.2400 కోట్ల పెట్టుబడులు పొందడం అభినందనీయమని ట్విటర్‌లో తెలిపారు. దీనిపై కేటీఆర్‌ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మన దేశంలో పారిశ్రామికవేత్తలను గౌరవించడం, సత్కరించడం, ఆనందం పంచుకుంటూ వారితో సంబరాలు చేసుకోవడం ఆనవాయితీ కావాలి. తద్వారా వారికి ఉపాధికల్పన, సంపద సృష్టి తేలికవుతుంది. టీఎస్‌ఐపాస్‌ తదితర వినూత్న విధానాలతో ఎర్రతివాచీ వేసి పారిశ్రామికవేత్తలను స్వాగతిస్తున్నాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. దీనికి హర్ష్‌ గోయెంకా స్పందిస్తూ దేశానికి మీలాంటి నాయకుల అవసరముందంటూ కేటీఆర్‌ను మరోసారి ప్రశంసించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని