విజయవాడ దుర్గమ్మ దర్శనానికి ఆన్‌లైన్‌లో టికెట్లు

ప్రధానాంశాలు

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి ఆన్‌లైన్‌లో టికెట్లు

దసరా శరన్నవరాత్రుల్లో రోజుకు 10వేల మందికే దర్శనం

ఈనాడు, అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా శరన్నవరాత్రోత్సవాల్లో రోజుకు 10వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. అక్టోబరు 7 నుంచి 15 వరకు దుర్గగుడిలో దసరా వేడుకలు జరగనున్నాయి. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, దేవాదాయశాఖ కమిషనర్‌ వాణీమోహన్‌, కృష్ణా జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల నిర్వహణపై గురువారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో రోజుకు 10వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని, దర్శన టికెట్లను ముందుగానే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించనున్నట్లు మంత్రి వెలంపల్లి తెలిపారు. భవానీ దీక్షలకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ ఉండవన్నారు. ఈ ఏడాది కూడా కృష్ణా నదిలో స్నానాలకు అనుమతించట్లేదని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని