రూ.4,427 కోట్లతో రెండు ఎత్తిపోతలు

ప్రధానాంశాలు

రూ.4,427 కోట్లతో రెండు ఎత్తిపోతలు

ఈనాడు హైదరాబాద్‌: ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని నాలుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో రూ.4,427 కోట్లతో రెండు ఎత్తిపోతల పథకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో సింగూరుకు నీటిని మళ్లించి, అక్కడి నుంచి 3.84 లక్షల ఎకరాల ఆయకట్టుకు సరఫరా చేయడానికి ఈ పథకాలు నిర్మించనున్నారు. సింగూరు నుంచి జహీరాబాద్‌, సంగారెడ్డి, అందోలు నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు చేపట్టే సంగమేశ్వర ఎత్తిపోతలకు రూ.2,653 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. లిప్టు, కాలువ, లైనింగ్‌ తదితర పనులు ఇందులో ఉన్నాయి. నారాయణఖేడ్‌, అందోలు నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు రూ.1,774 కోట్ల అంచనా వ్యయంతో బసవేశ్వర ఎత్తిపోతల నిర్మించనున్నారు. ఈ రెండు పనులకు నాబార్డు నుంచి రుణం తీసుకొని చేపట్టడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని