మూడు ప్రాజెక్టులకు భారీ రుణం!

ప్రధానాంశాలు

మూడు ప్రాజెక్టులకు భారీ రుణం!

రూ.5,300 కోట్లు ఇచ్చేందుకు బ్యాంకుల కన్సార్షియం సుముఖం

ఈనాడు, హైదరాబాద్‌: మూడు ప్రధాన ప్రాజెక్టులకు రూ.5,300 కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంకుల సమాఖ్య (కన్సార్షియం) ఒకటి ముందుకొచ్చింది. వరద కాల్వ(ఎఫ్‌ఎఫ్‌సీ), దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల్లో మిగిలి ఉన్న పనుల పూర్తికి నిధులు సమకూర్చేందుకు అంగీకారం తెలిపాయి. దీనిలో భాగంగా శుక్రవారం నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌తో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ప్రతినిధులు భేటీ అయ్యారు. తొలి విడతగా రూ.వెయ్యి కోట్లు అందించేందుకు ప్రాథమికంగా అంగీకరించినట్లు తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతోపాటు వరద కాల్వ, దేవాదుల పథకాల్లోనూ పలు పనులు మిగిలి ఉన్నాయి. వీటన్నింటినీ పూర్తి చేయడానికి నీటిపారుదల శాఖ.. బ్యాంకుల సహకారం కోరగా, రుణం మంజూరుకు పలు దఫాలుగా చర్చలు కొనసాగుతున్నాయి.

* మరోవైపు నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో శుక్రవారం సాయంత్రం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ అధ్యక్షతన బోర్డ్‌ ఆఫ్‌ చీఫ్‌ ఇంజినీర్స్‌ సమావేశం జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణాల్లో వినియోగించే స్టీల్‌, సిమెంటు, ఇతర పదార్థాలకు సంబంధించి ధరల పెంపుపై చర్చించినట్లు తెలిసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని