డ్రిప్‌ ప్రాజెక్టు కింద తెలంగాణకు రూ.545 కోట్లు!

ప్రధానాంశాలు

డ్రిప్‌ ప్రాజెక్టు కింద తెలంగాణకు రూ.545 కోట్లు!

ఈనాడు, హైదరాబాద్‌: డ్యాం రిహాబిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టులో (డీఆర్‌ఐపీ) రాష్ట్రం చేరితే రూ.545 కోట్లు కేటాయించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌కు లేఖ రాశారు. ‘‘ఈ నెల 14న కేంద్ర జలసంఘం అధికారులు హైదరాబాద్‌లో ఇంజినీర్లతో సమావేశమయ్యారు. దీనిపై తెలంగాణ ఆసక్తి చూపింది. రెండో దశ కింద ఎంపిక చేయనున్న రాష్ట్రాలు నవంబరులోగా కేంద్రంతో ఒప్పందం చేసుకోవాలి. డ్రిప్‌ నిధులతో డ్యాంల నిర్వహణ, బలోపేతం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది’’ అని ముఖర్జీ లేఖలో తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని