పుప్పాలగూడలో మరికొన్ని ప్లాట్ల వేలం నిలిపివేత

ప్రధానాంశాలు

పుప్పాలగూడలో మరికొన్ని ప్లాట్ల వేలం నిలిపివేత

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలోని భూముల వేలానికి సంబంధించి టీఎస్‌ఐఐసీ జారీ చేసిన నోటిఫికేషన్‌లోని మరికొన్ని ప్లాట్ల వేలాన్ని నిలిపివేస్తూ శుక్రవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ భూములను వేలం వేయడాన్ని సవాలు చేస్తూ రామచందర్‌సింగ్‌ మరో ఆరుగురు దాఖలు చేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. సర్వే నం.326, 327, 301, 303ల్లో ఉన్న 13, 14, 15, 24, 27, 30 ప్లాట్‌ల వేలాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నంబర్లలో కాందిశీకులకు చెందిన 18 ఎకరాల భూమి వివాదంలో ఉండగా ప్రభుత్వం వేలం వేయడం సరికాదంటూ వేలాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సర్వే నం.302లో 10.19 ఎకరాలకు సంబంధించి వేలాన్ని నిలిపివేయాలంటూ మరో పిటిషన్‌ దాఖలవ్వగా.. దీనిపై సోమవారం ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని