జైలుకు మావోయిస్టు నేత దుబాసి శంకర్‌

ప్రధానాంశాలు

జైలుకు మావోయిస్టు నేత దుబాసి శంకర్‌

నవరంగపూర్‌, న్యూస్‌టుడే: మావోయిస్టు కీలక నేత దుబాసి శంకర్‌ కస్టడీ గడువు శుక్రవారంతో ముగిసింది. పోలీసులు అతడిని జయపురంలోని సబ్‌డివిజనల్‌ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి సంతోష్‌ పాణిగ్రహి.. జైలుకు తరలించాలని ఆదేశించారు. ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా బొయిపరిగుడ అటవీ ప్రాంతంలో ఈ నెల 13న శంకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో అతడిని ఇప్పటికి రెండు సార్లు కస్టడీలోకి తీసుకుని విచారించామని ఎస్డీపీవో అరుప్‌ అభిషేక్‌ బెహర తెలిపారు. జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) అధికారులు శంకర్‌ను ప్రశ్నించి మావోయిస్టులకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. తెలంగాణ, ఆంధ్రా పోలీసులు కూడా దుబాసి శంకర్‌ను విచారించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని