తితిదే బోర్డు ప్రత్యేక ఆహ్వానితుల జీవోపై సుప్రీంకోర్టులో కేవియట్‌

ప్రధానాంశాలు

తితిదే బోర్డు ప్రత్యేక ఆహ్వానితుల జీవోపై సుప్రీంకోర్టులో కేవియట్‌

ఈనాడు, దిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుల వ్యవహారంపై అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ తెదేపా బాధ్యుడు మాదినేని ఉమామహేశ్వర నాయుడు శుక్రవారం సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేశారు. తితిదే బోర్డులో 50మందికిపైగా ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జీవోను స్తంభింపజేస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 22న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ముందస్తుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని