51 ఎలక్ట్రీషియన్‌ పోస్టులకు 3,232 మంది పోటీ

ప్రధానాంశాలు

51 ఎలక్ట్రీషియన్‌ పోస్టులకు 3,232 మంది పోటీ

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి సంస్థలో 51 ఎలక్ట్రీషియన్‌ పోస్టులకు 3,232 మంది పోటీపడుతున్నారని సంస్థ సంచాలకుడు బలరాం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వీరికి ఈ నెల 26న కొత్తగూడెంలో రాతపరీక్ష నిర్వహిస్తున్నట్లు వివరించారు. హాల్‌టిక్కెట్లను ఇప్పటికే సంస్థ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ పరీక్ష పూర్తయిన తర్వాత మోటార్‌ మెకానిక్‌ పోస్టులకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. త్వరలో 177 జూనియర్‌ అసిస్టెంటు ఉద్యోగాలకు ప్రకటన జారీచేస్తామని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని