కొత్తగా 239 కొవిడ్‌ కేసులు

ప్రధానాంశాలు

కొత్తగా 239 కొవిడ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 239 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,64,650కి పెరిగింది. మహమ్మారితో ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు 3,911 మంది కన్నుమూశారు. తాజాగా 336 మంది ఆరోగ్యవంతులయ్యారు. మొత్తం 6,55,961 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,778 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 50,569 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 2,61,04,976కు పెరిగింది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 68 కరోనా కేసులు నమోదు కాగా.. కరీంనగర్‌ జిల్లాలో 17, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో 16 చొప్పున, హనుమకొండలో 12, జగిత్యాల, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో 10 చొప్పున పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని