జన్యువుల పనితీరు తగ్గడం వల్లే రుచి కోల్పోతున్న కొవిడ్‌ రోగులు

ప్రధానాంశాలు

జన్యువుల పనితీరు తగ్గడం వల్లే రుచి కోల్పోతున్న కొవిడ్‌ రోగులు

సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ రోగులు రుచి, వాసన కోల్పోవడానికి గల కారణాలను సీసీఎంబీ పరిశోధకులు గుర్తించారు. రుచి, వాసన పసిగట్టే జన్యువులు మార్పులకు లోనవడమే కారణమని గమనించారు. కొవిడ్‌ మొదటి వేవ్‌ సమయంలో వైరస్‌ బారినపడిన 36 మంది రోగుల నుంచి నమూనాలను సేకరించి పరిశోధించారు. మనిషి శరీరంలో 20 వేల జన్యువులు ఉంటాయని.. ఇన్‌ఫెక్షన్‌ బారిన పడినప్పుడు ఇవి ప్రభావితం అవుతుంటాయని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్‌ కార్తిక్‌ భరద్వాజ్‌ చెప్పారు. కొవిడ్‌ సోకిన వారిలో 251 జన్యువులు క్రియాశీలకంగా ఉండగా.. 9,068 జన్యువుల పనితీరు తగ్గినట్లు గుర్తించామన్నారు. ఫలితంగా తలెత్తే ప్రభావాల్లో రుచి, వాసన కోల్పోవడం ఒకటని చెప్పారు. గత ఏడాది చేసిన ఈ అధ్యయనం తాజాగా ‘క్లినికల్‌ అండ్‌ ట్రాన్స్‌లేషనల్‌ మెడిసిన్‌ జర్నల్‌’లో ప్రచురితమైంది. నితీష్‌ కుమార్‌ సింగ్‌, సురభీశ్రీవాస్తవ, లుముక్‌ జవేరి, త్రిలోక్‌ చందర్‌ బింగి, ఎం.రాజారావు, సంతోష్‌కుమార్‌, వి.నామామి గౌర్‌, నిఖిల్‌, ప్రత్యూష, సాక్షి శాంభవి, షాగుఫ్తా ఖాన్‌, మామిళ్ల సౌజన్య, తులసి నాగబండి, రాకేశ్‌ మిశ్ర ఈ పరిశోధనలో పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని