కులాల వారీగా జన గణన సాధ్యం కాదనడం అన్యాయం: కృష్ణయ్య

ప్రధానాంశాలు

కులాల వారీగా జన గణన సాధ్యం కాదనడం అన్యాయం: కృష్ణయ్య

కాచిగూడ, న్యూస్‌టుడే: జనాభా గణనలో కులాలవారీగా లెక్కలు తీయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడం అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య మండిపడ్డారు. శుక్రవారమిక్కడ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. కులాలవారీగా జనాభా లెక్కలు తీయాలని సుప్రీంకోర్టులో జాతీయ బీసీ సంక్షేమ సంఘం, మహారాష్ట్ర ప్రభుత్వం కేసులు దాఖలు చేశాయని తెలిపారు. ఈ కేసులకు సమాధానంగా.. కులాలవారీగా లెక్కలు సాధ్యం కాదని కేంద్రం పిటిషన్‌ దాఖలు చేసిందన్నారు. బీసీ కులాల అభివృద్ధి, పథకాల అమలు, వర్గీకరణ, రిజర్వేషన్ల కేటాయింపునకు జనాభా లెక్కలు అవసరమని చెప్పారు. సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసు సురేశ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, కోల జనార్దన్‌ పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని