వాగు ఆగదు.. వంతెన పూర్తవదు!

ప్రధానాంశాలు

వాగు ఆగదు.. వంతెన పూర్తవదు!

భారీవర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడం సహజం. తరువాత నీరు తగ్గి మళ్లీ మామూలుగా రాకపోకలు సాగుతుంటాయి. కానీ, వంతెన పనులు సకాలంలో పూర్తిచేయక కొద్దిపాటి వర్షం పడినా వాగు పొంగి ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితి పెద్దేముల్‌ మండల పరిధి కందనెల్లి వాగు వద్ద నెలకొంది.  ఇక్కడి ఇక్కట్లు తొలగించాలనే సర్కారు రెండేళ్ల క్రితం వంతెన నిర్మాణం చేపట్టింది. అయితే.. అధికారుల పర్యవేక్షణ లోపం, గుత్తేదారు ఇష్టారాజ్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా వర్షం పడితే చాలు.. వాగు ఉద్ధృతి పెరిగి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాటాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వంతెన నిర్మాణం వేగంగా పూర్తిచేసి తమ ఇబ్బందులు తొలగించాలని ప్రజలు వేడుకుంటున్నారు.

- ఈనాడు, వికారాబాద్‌

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని